Wednesday, November 26, 2008

chiru update news

ప్రజారాజ్యం ప్రచార చిత్రంలో నగ్మా?మెగా బ్రదర్ నాగబాబు,నగ్మ జంటగా ఊరుకో ఠాగూర్ పేరుతో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. అయితే సినిమా కథ,కథనాలు ప్రజారాజ్యం పార్టి సిద్దాంతాలు ప్రచారం చేసేలా ఉంటాయని ఫిల్మ్ నగర్ న్యూస్. భాస్కర్ రాజానాయుడు నిర్మాతగా గంగోత్రి ఫిలింస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని ...

తెలంగాణపై స్పష్టంగానే చెప్పా: చిరువరంగల్: ప్రజా సేవ కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అన్నారు. ఆయన ప్రజా అంకిత యాత్ర సోమవారం వరంగల్ జిల్లాలోని పరకాల తదితర ప్రాంతాల్లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రజలు రావాలని కోరితే ప్రజలకు ...

డబ్బు కోసమే చిరు రాజకీయాల్లోకిచెన్నై: డబ్బు సంపాదించుకోడానికే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చారని సినీనటుడు నరసింహరాజు ఆరోపించారు. ప్రజారాజ్యం పార్టీ కోసం విరాళాలుగా చిరంజీవి కోట్లాది రూపాయలు దండుకున్నారని ఆయన చెన్నైలో విలేకరుల సమావేశంలో అన్నారు. పార్టీ టికెట్లను కూడా కోట్లాది రూపాయలకు అమ్ముకుంటున్నారని ఆయన విమర్శించారు. పార్టీ ...

'ప్రజారాజ్యం' టైటిల్ తో సినిమాచిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడంతో ఆ టైటిల్ ని వాడుకుంటూ ఫిల్మ్ జర్నలిస్ట్ ,నిర్మాత అయిన సురేష్ కొండేటి ఓ సినీ నిర్మాణానానికి పూనుకుంటున్నారని సమాచారం. గతంలో ప్రేమిస్తే అనే డబ్బింగ్ సినిమాతో కలెక్షన్స్ కుంభవృష్టి కురిపించుకున్న సురేష్ ఈ సారి ప్రజారాజ్యం ... చిరుకు తెలిసి వస్తుంది: మొయిలీన్యూఢిల్లీ: ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి రాజకీయాలకు కొత్త అని, తెలంగాణపై చేసిన ప్రకటన పరిణామాలు చిరంజీవికి ముందు ముందు తెలిసి వస్తాయని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ అన్నారు. తెలంగాణకు చిరంజీవి మద్దతిస్తూ చేసిన ప్రకటనపై ఆయన శుక్రవారం ...

సామాజిక న్యాయమే ఎజెండా: చిరుకరీంనగర్: ప్రజల ప్రేమను పొందడం తన పూర్వజన్మ పుణ్యమని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. శుక్రవారం ఆయన ప్రజా అంకిత యాత్ర కరీంనగర్ జిల్లా కోరుట్ల తదితర ప్రాంతాల్లో జరిగింది. సినిమాల్లో తన బొమ్మను చూసి ప్రజలు తనపై ప్రేమను పెంచుకున్నారని, ...

చిరు వైఖరి తర్వాతే కాంగ్రెస్ నిర్ణయంన్యూఢిల్లీ: తెలంగాణపై ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తన వైఖరిని ప్రకటించే వరకు వేచి చూడాలని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానవర్గం నిర్ణయించుకున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కూడా తెలంగాణకు వ్యతిరేకంగా ఉండడంతో ఆ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణపై తమ కాంగ్రెస్ ...

చిరుతో అసమానతలు మాయం: పవన్హైదరాబాద్: అన్నయ్య చిరంజీవితోనే సామాజిక న్యాయం సాధ్యమని ప్రజారాజ్యం పార్టీ నాయకుడు, సినీ హీరో పవన్ కళ్యాణ్ అన్నారు. కరీంనగర్, వరంగల్, నల్లగొండ పార్టీ ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మంగళవారం మాట్లాడారు. చిరంజీవితోనే సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆయన చెప్పారు. ...

చిరు మరో షెడ్యూలు"ప్రజారాజ్యం" అధినేత చిరంజీవి మరో మారు ప్రజా అంకితయాత్రకు సిద్ధమవుతున్నారు. దీపావళి వరకు విశ్రాంతి తీసుకోమని వైద్యులు సలహా ఇచ్చినప్పుటికీ ఇప్పటికే అన్ని ఆరోగ్య సమస్యలు సద్దుమణిగినందున రెండు మూడు రోజుల్లో యాత్రను ప్రారంభించాలని చిరంజీవి యోచిస్తున్నట్టు సమాచారం. ఉత్తరాంధ్రలో చిరంజీవి యాత్రలు ...

సినిమా వాళ్ళకి పండగే పండగప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర రాజకీయ తెర మీదికి వచ్చినప్పటి నుంచి రాజకీయాల్లో సినిమావాళ్ళకి మరింత గిరాకీ పెరిగింది. చిరు పార్టీలో ఆయనే పెద్ద ఆకర్షణ. ఆ తర్వాత పవన్ కళ్యాణ్. శ్రీకాంత్, బ్రహ్మానందం వంటి ఆస్ధాన విధ్వాంసులు ఎటూ ఉన్నారు. చిరుపార్టీకి అల్లు ...అర్జున్, రామ్ చరణ్ వంటి హీరోల ప్రచారం అవసరమే లేదు. తెలుగుదేశం పార్టీ మాత్రం తారకరత్నను కూడా వదలకుండా నందమూరి అందగాళ్ళందరి సహకారం కోరుతోంది. నందమూరి వంశంలో బాలనటులెవరైనా ఉన్నా కూడా వారినీ వీధుల్లోకి తీసుకొచ్చి తిప్పడానికి చంద్రబాబు నాయుడు వెనుకాడే వారు కాదేమో.వందేళ్ళకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి ఎక్కువగా సినిమా పరిమళం కోసం పరితపిస్తోంది. నటులైతే చాలు, ముసలీ ముతకా అయినా ఫర్వాలేదన్నట్టు ఆ పార్టీ వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. హీరో కృష్ణకు ఒక ఫేవర్, జీవిత-రాజశేఖర్ దంపతులకు మరో ఫేవర్, జయసుధకో హామీ, ఎస్వీ కృష్ణారెడ్డికి మరో హామీ ఇచ్చి వారితో పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్, వైఎస్ కు అత్యంత సన్నిహితుడు కెవిపి రామచంద్రరావు గ్రూపు ఫోటోలు దిగి సామాన్య ప్రజలకు ఎనలేని వినోదాన్ని పంచారు.

No comments: