చెన్నై: డబ్బు సంపాదించుకోడానికే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చారని సినీనటుడు నరసింహరాజు ఆరోపించారు. ప్రజారాజ్యం పార్టీ కోసం విరాళాలుగా చిరంజీవి కోట్లాది రూపాయలు దండుకున్నారని ఆయన చెన్నైలో విలేకరుల సమావేశంలో అన్నారు. పార్టీ టికెట్లను కూడా కోట్లాది రూపాయలకు అమ్ముకుంటున్నారని ఆయన విమర్శించారు.పార్టీ పెట్టాలన్న ఆలోచన చిరంజీవికి లేనప్పటికీ బావమరిది అల్లు అరవింద్, తమ్ముడు నాగబాబు డబ్బు సంపాదనే ధ్యేయంగా పార్టీ పెట్టారని నరసింహరాజు అన్నారు. ప్రజాసేవ చేయాలంటే అనేక మార్గాలు ఉన్నాయని, చిరంజీవి ముఖ్యమంత్రి కానవసరం లేదని రాజు అభిప్రాయపడ్డారు. ఇంకా రాజకీయాలు నేర్చుకుంటున్న చిరంజీవి వంటి వారికి రాష్ట్రాన్ని అప్పగిస్తే అధోగతి తప్పదన్నారు. చంద్రబాబును కూడా విమర్శించిన ఆయన వైఎస్ రాజశేఖరరెడ్డి పథకాలను మెచ్చుకున్నారు.
ani margalu vunda ga narashimaha raju garu politic lo ki andhuku vachnatlu....miru vasrthe sevaa...chiru vasthe money kosam......
No comments:
Post a Comment